పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్ షాక్‌తో మృతి - Man Dies Current Shock in nirmal
Published : Feb 14, 2024, 9:55 PM IST
Groom Died With Current shock in Nirmal : మరోమూడు రోజులుకు పెళ్లికొడుకుగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దీంతో అప్పటి వరకు పెళ్లి సందడితో ఆనందోత్సవాల మధ్య ఉన్న ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా బెల్లల్ గ్రామంలో మీరాల వినోద్ అనే యువకుడుకి ఈ నెల 18న పెళ్లి జరగనుంది.
Groom Died With Geyser Shock in Nirmal : ఈ క్రమంలో ఇంట్లోని స్నానానికి వెళ్లిన వినోద్ ప్రమాదవశాత్తు బాత్రుంలో గీజర్‌తో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వినోద్‌ను ఆసుపత్రికి తరిలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పెళ్లి కొడుకుగా పెళ్లిపీటలు ఎక్కాల్సింది పోయి, పాడె ఎక్కాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.