అందుబాటులోకి మరో పైవంతెన - రేపు సీఎం చేతుల మీదుగా గోపన్పల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం - Gopanpally Flyover inaugurate - GOPANPALLY FLYOVER INAUGURATE
Published : Jul 19, 2024, 7:25 PM IST
Gopanpally Flyover in Hyderabad : ట్రాఫిక్ సమస్య నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు హైదరాబాద్లో నిర్మించిన పైవంతెనలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి. నగర శివారు ఐటీ కారిడార్లోని గోపన్పల్లి తండా వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.28 కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఆ వంతెనతో గచ్చిబౌలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల, కొల్లూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో పీవీరావ్ నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. వై ఆకారంలో ఒకవైపు వెళ్లేందుకు మాత్రమే వీలుండే విధంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. గోపన్పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్లో కలిసే రేడియల్ రోడ్డుపై తండా జంక్షన్ వద్ద ఈ వంతెన నిర్మించారు. ఈ విషయంపై వంతెనను ఎప్పుడు ప్రారంభిస్తారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం 10 రోజుల క్రితం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి గోపన్పల్లి తండా పైవంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.