ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాజీ మంత్రి గల్లా అరుణ స్వీయ చరిత్ర - ప్రముఖుల ప్రశంసలు - Galla Arunakumari autobiography - GALLA ARUNAKUMARI AUTOBIOGRAPHY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 6:48 PM IST

Galla Arunakumari Autobiography : మాజీమంత్రి గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పుస్తకాన్ని తిరుపతిలోని అమరరాజా ఆడిటోరియంలో ఆవిష్కరించారు. దాదాపు వేయి పేజీలు కలిగిన పుస్తకంలో అసమానతలు, స్త్రీ-పురుష వివక్ష, సంస్కృతుల మధ్య తేడాలను కళ్లకు కట్టేలా వివరించారు. ఈ పుస్తకం ఉమ్మడి ఏపీ ఆర్థిక, రాజకీయాలను ప్రతిబింబించే డాక్యుమెంట్​లా ఉందని ప్రముఖ రచయిత్రి ఓల్గా ప్రశంసించారు. నేటి యువతకు స్వీయచరిత్ర మార్గదర్శకంగా ఉంటుందని ప్రముఖులు కొనియాడారు. స్వీయ చరిత్రలో తనతో కలిసి ప్రయాణించిన వారందరినీ ప్రస్తావించినట్లు అరుణ తెలిపారు. ఈ పుస్తకం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేలా రాసినట్లు వెల్లడించారు. పరిస్థితులను, యదార్థ సంఘటనలు ప్రస్తావించానే తప్ప ఎవర్నీ కించపరచలేదని అరుణ స్పష్టం చేశారు.

స్వీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో గల్లా అరుణకుమారి మాట్లాడుతూ ప్రింట్‌కు ముందు పుస్తకం చదివిన కొంతమంది చాలా బాగుందన్నారని తెలిపారు. చాలామంది బాగుందనేసరికి తనలో ఇంకాస్త ధైర్యం వచ్చిందని చెప్పారు. పుస్తకం రాసేందుకు చాలా మంది తనకు సహకరించారని, వారందరి కృషి ఫలితమే పుస్తకం బయటకు రావడానికి కారణమని పేర్కొన్నారు. తనతో నడిచిన ప్రతిఒక్కరి గురించి పుస్తకంలో పొందుపరిచానని అరుణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details