నిండుకుండలా సింగూరు - 3 గేట్లు ఎత్తిన అధికారులు - Flood Inflow To Singur Project
Published : Sep 5, 2024, 8:03 PM IST
Flood Inflow To Singur Project : గత మూడు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డిలోని సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు పోటెత్తింది. దీంతో జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి కెపాసిటీ 29.917 టీఎంసీలు కాగా 28 టీఎంసీలకు వరద నీరు చేరుకుంది. దీంతో జలాశయం మూడు గేట్లను 1.50 మీటర్ల పైకి ఎత్తి మంత్రి దామోదర రాజనరసింహా నీటిని దిగువకు విడుదల చేశారు.
ఈ సుందర దృశ్యాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గత నెల రోజుల వరకు జలాశయంలో నీటి స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఇటీవల కురిసిన వర్షాలకు రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు భారీగా వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 15.70 టీఎంసీలు కాగా ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,50,410 క్యూసెక్కులుగా ఉంది.