తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ - ఎప్పుడైనా చూశారా? - Monkeys Hulchul in Suryapet - MONKEYS HULCHUL IN SURYAPET

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 5:54 PM IST

Monkeys Hulchul in Suryapet District : సాధారణంగా ఐదారు కోతులు ఉంటేనే భయపడిపోయి, జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఓ గ్రామంలో వేలాది కోతులు పరస్పరం దాడులు చేసుకుంటూ వానర యుద్ధవాతావరణమే నెలకొల్పాయి. దీంతో రెండు మూడు గంటలపాటు ఆ గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని భగత్ సింగ్ కాలనీలో వందల కోతులు ఇళ్లపైకి చేరి బీభత్సం సృష్టించాయి. 

సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డువెంట ఉన్న ఈ కాలనీకి చేరిన కోతులు రెండు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశాయి. సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో వానర యుద్ధవాతావరణం నెలకొంది. కోతుల అరుపులకు దారివెంట వెళ్లేవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోతుల బీభత్సానికి స్థానికుల ఇంటి పైకప్పులు సైతం ధ్వంసం అయ్యాయి. చివరకు కాలనీవాసులు కర్రలతో భయపెడుతూ గ్రామశివారులకు తరిమారు. మరోవైపు కోతుల బెడద లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని స్థానికులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details