ఖమ్మం జిల్లాలో ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ఆందోళన - FARMERS PROTEST IN EKALAVYA SCHOOL - FARMERS PROTEST IN EKALAVYA SCHOOL
Published : Oct 2, 2024, 4:34 PM IST
Farmers Protest in Ekalavya School: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రైతుల నిరసనతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కారేపల్లి మండలం రేలకాయలపల్లి వద్ద ఏకలవ్య పాఠశాల గేటు ముందు భూములు కోల్పోయిన రైతులు పురుగు మందుల డబ్బాలతో ఆందోళనకు దిగారు. కాగా ఈ రోజు(అక్టోబర్ 02)న ప్రధాని మోదీ వర్చువల్గా ఏకలవ్య పాఠశాలను ప్రారంభించనున్నారు. కారేపల్లి మండలంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి కావాల్సిన భూములు ఇస్తే ఆ రైతులకు పరిహారంతో పాటు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు నిరసన వ్యక్తం చేస్తూ, ఒక దశలో పురుగుమందులు తాగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు తలదూర్చి కమిషన్లు కొట్టేశారని పలు ఆరోపణలు చేశారు. భూములు పాఠశాలకు ఇచ్చినప్పటి నుంచి వారికి ఉపాధి దొరకడం లేదని వాపోయారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులందరికీ లేఖ సమర్పించారు.