SBI Notification For 600 Posts : దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం ఎస్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాక్‌లాగ్ ఖాళీలతో కలిపి మొత్తం 600 పోస్టులు దీని ద్వారా భర్తీ చేయనున్నారు.
రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్ రాత పరీక్షలో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తోన్న ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షా పద్ధతిలో మార్పులు జరిగాయి. సబ్జెక్టులు, పరీక్షా సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ, ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో చిన్న మార్పులు చేశారు.
- ప్రిలిమ్స్ పరీక్షలో ఇంగ్లీష్ విభాగానికి ప్రాధాన్యం పెరిగింది. ప్రశ్నల సంఖ్య 30 నుంచి 40కి పెంచారు.
- రీజనింగ్, ఆప్టిట్యూడ్‌లలో 5 ప్రశ్నలను తగ్గించి, రెండింటికి 30 ప్రశ్నల చొప్పున కేటాయించారు. కాగా మొత్తం ప్రశ్నల సంఖ్యలో ఎలాంటి మార్పులు జరగలేదు.
- మెయిన్స్ పరీక్షలో రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల ప్రశ్నల సంఖ్యలో మార్పులు జరగలేదు కానీ వాటికి కేటాయించిన మార్కులు 10చొప్పున పెరిగాయి. అంటే వీటి ప్రాధాన్యం పెరిగింది.
- జనరల్ అవేర్‌నెస్‌లో ప్రశ్నలు పెరిగాయి కానీ మార్కుల్లో ఎలాంటి మార్పులు లేవు.
- ఇంగ్లీష్ సెక్షన్‌లో 5 ప్రశ్నలు పెరిగి 20 మార్కులు తగ్గాయి.
వేతనంతో పాటు అదనంగా : ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐలో భారీ వేతనాలు, సదుపాయాలు ఉంటాయి. రూ.48,480 మూల వేతనంతో పాటు నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో జీతం ఉంటుంది. ముంబయిలో పీఓకి రూ.18.67లక్షల వార్షిక వేతనం అందుతుంది. మెడికల్, డీఏ, ఎల్‌ఎఫ్‌సీ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఎఫ్, ఎన్‌సీఎస్ లాంటి అనేక సదుపాయాలు లభిస్తాయి.
నోటిఫికేషన్ వివరాలు | |
పోస్టుల సంఖ్య | 600 |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ (30.04.2025) |
వయసు | 21-30 సంవత్సరాలు (1.04.2024) |
దరఖాస్తు ఫీజు | రూ.750 (యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ) ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు) |
దరఖాస్తు గడువు | జనవరి 16, 2025 |
ప్రిలిమ్స్ | మార్చి 2025 |
మెయిన్స్ | ఏప్రిల్/ మే 2025 |
ఫేజ్-3 | మే/జూన్ 2025 |
ఫలితాల ప్రకటన | మే/జూన్ 2025 |
వెబ్‌సైట్ | www.sbi.co.in |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - డిగ్రీ అర్హతతో SBIలో 13,735 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
స్టడీ ప్లాన్ సన్నద్ధతకు ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సమయాన్ని అనుసరించి టైమ్-టేబుల్ తయారు చేసుకోవాలి. సబ్జెక్టుపై ఉన్న గ్రిప్ ప్రకారం ఏ సబ్జెక్టులకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. దీన్ని మీరకుండా నిబద్ధతతో తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.
- పరీక్ష విధానం, సిలబస్ : ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష విధానాన్ని క్షుణ్నంగా తెలుసుకుని పరీక్షలో వివిధ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ను గుర్తించాలి.
- పక్కా ప్లాన్ : స్టడీ ప్లాన్ సన్నద్ధతకు ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సమయాన్ని అనుసరించి టైమ్-టేబుల్ తయారు చేసుకోవాలి. సబ్జెక్టుపై ఉన్న గ్రిప్ ప్రకారం ఏ సబ్జెక్టులకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. దీన్ని మీరకుండా నిబద్ధతతో తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.
- సబ్జెక్టు సన్నద్ధతకు సంబంధించిన మెటీరియల్ సమకూర్చుకోవాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చాలా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది.
- ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టుల్లోని వివిధ టాపిక్స్ బేసిక్ కాన్సెప్టులు బాగా అర్థం చేసుకోవాలి. వాటిలో వివిధ స్థాయుల్లోని ప్రశ్నలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని దాని ఆధారంగా అడిగే ప్రశ్నలు సాధన చేయాలి.
- ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లోని అన్ని విభాగాలు ముఖ్యమైనవే. అభ్యర్థులు వివిధ సబ్జెక్టులు/ టాపిక్స్‌లో ఎందులో ముందున్నాం, వెనుకబడి ఉన్నామని గ్రహించాలి. వీక్ ఉన్న సబ్జెక్టు లేదా టాపిక్‌ను బాగా నేర్చుకోవాలి.
- ఏ టాపిక్స్ నుంచి తరచుగా ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించాలి. అదే విధంగా ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ను గత ప్రశ్నపత్రాల ద్వారా తెలుసుకొని, ఏ మార్కులకు ఏ ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించి వాటిని బాగా సాధన చేయాలి.
- తక్కువ సమయం, నెగటివ్ మార్కులు ఉన్న కారణంగా ప్రశ్నలు త్వరగా సాల్వ్ చేయాలి. అలాగే తప్పులు లేకుండా చేయగలిగేలా సాధన చేయాలి.
- సన్నద్ధత ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకోవడానికి మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్ రాశాక దాన్ని విశ్లేషించుకోవాలి. తర్వాత ఎక్కడ తప్పు చేశారో గుర్తించాలి. ఇలా రాయడం వల్ల నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు ఎంత కచ్చితత్వంతో సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. అదే విధంగా బలహీనంగా ఉన్న అంశాలు/విభాగాలు తెలుస్తాయి. దానికి తగ్గట్టు సాధన మెరుగుపరుచుకోవాలి.
- సన్నద్ధత పూర్తయ్యాక రివిజన్ చేసుకోవడానికి వీలుగా వివిధ విభాగాలు/ అంశాల్లో ముఖ్యమైన పాయింట్ల ఆధారంగా షార్ట్‌నోట్స్ తయారు చేసుకోవాలి. చివరి నిమిషంలో రివిజన్‌కు ఇది చాలా ఉపయోగపడుతోంది.
- ప్రతిరోజూ వార్తా పత్రికలు చదవాలి. పేపర్ చదివినప్పుడు పాయింట్లను అంశాల వారీగా నోట్ చేసుకోవాలి. ఇది జనరల్ అవేర్‌నేస్ విభాగానికి చాలా అవసరం.
- ప్రతిరోజూ వార్తా పత్రికలు చదవాలి. పేపర్ చదివినప్పుడు పాయింట్లను అంశాల వారీగా నోట్ చేసుకోవాలి. ఇది జనరల్ అవేర్‌నేస్ విభాగానికి చాలా అవసరం.
మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. మొదటి దశ ప్రిలిమ్స్ ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారి నుంచి మొత్తం ఖాళీలకు 10 రెట్ల అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారి నుంచి మూడు రెట్ల అభ్యర్థులను మూడో దశకు ఎంపిక చేస్తారు. అప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్య్వూలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు రెండో దశలో, మూడో దశలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
స్టేట్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు - 4:3:2:1 ఫార్ములాతో జాబ్ కొట్టండిలా!