రుణమాఫీపై రైతుల ఆందోళన - మాటిచ్చిన ప్రకారమే మాఫీ చేయాలని డిమాండ్ - ADILABAD LOAN WAIVER ISSUES
Published : Aug 22, 2024, 12:35 PM IST
Raithu Runamafi TG Govt: ఆదిలాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చోటుచేసుకున్న తప్పిదాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్‌లో బ్యాంకు శాఖలో రూ. 32కోట్ల రుణమాఫీకి సిఫారసు చేస్తే కేవలం రూ. 2.5 కోట్లే మాఫీ చేశారు. తాజాగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తలమడుగు, జైనథ్ మండలాల్లోనూ అలాంటి ఘటనలే బయటపడుతుండటం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా ఏజెన్సీలోని రైతులకు రుణమాఫీ గురించి బ్యాంకర్లు సరైన సమాచారం ఇవ్వటంలేదు. మరోపక్క రూ. రెండు లక్షలకంటే ఒక్క రూపాయి ఎక్కువగా అప్పు ఉన్నా రైతులకు మాఫీ వర్తిస్తుందా? లేదా? అనే అనుమానాలకు తావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారని, దాని ప్రకారమే రుణమాఫీని అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించి రుణమాఫీ పై పలు అనుమాలను అడగగా అస్పష్టమైన సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.