తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఓట్ల కోసం రాజకీయ నేతల పాట్లు - హోటల్లో పూరీలు చేసి ఓటర్లకు వడ్డించిన ఎర్రబెల్లి - Errabelli Dayakar Election Campaign - ERRABELLI DAYAKAR ELECTION CAMPAIGN

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 2:40 PM IST

EX Minister Errabelli Dayakar Election Campaign : సార్వత్రిక ఎన్నికలవేళ ఓటర్లను ఆకర్షించుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మన్ననలు పొందేందుకు పడరాని పాట్లు పడుతూ  ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఏకంగా ఓ హోటల్లో పూరీలు చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు.

రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రోడ్ షో చేసి పలు గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించారు. నందనం గ్రామంలో ఓ హోటల్​కు వెళ్లి తాను వంట చేస్తానని తన వంటకు చాలా మంది ఫ్యాన్స్​ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు. నందనం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్​ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details