ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఒంగోలు ఎంపీ సీటు​ ఎవరికిచ్చినా నాకు ఓకే : మాజీ మంత్రి బాలినేని - ఒంగోలు ఎమ్మెల్యే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 3:32 PM IST

EX Minister Balineni Srinivasa Reddy: ఒంగోలు ఎంపీ స్థానం ఎవరికి కేటాయించినా తనకు సమ్మతమేనని మాజీ మంత్రి, వైఎస్సార్​సీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అదిష్ఠానం ఏది చెబితే తాను అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరికీ లేని పట్టింపు తనకు ఒక్కడికే ఎందుకని ఆయన అన్నారు. తాను పార్టీ మారడం లేదని తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో 25వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే తన ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. 

అందుకోసమే తాను కృషి చేస్తానని వివరించారు. ఒంగోలులో తన గెలుపే లక్ష్యమని అది మాత్రమే చూసుకుంటానని తేల్చి చెప్పారు. ఎంపీ అభ్యర్థి మంచి స్థాయి ఉన్న నేత అయితే బాగుంటుందనేది తన ఉద్దేశ్యమని ఆయన వెల్లడించారు. అందరికోసమే తన పోరాటమని, మిగిలిన నియోజకవర్గల్లోని అభ్యర్థులు దీనిపై పట్టీ పట్టనట్లు ఉంటున్నారన్నారు. అధిష్ఠానం ఏం చేప్తే అది చేస్తానని ఆయన వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details