LIVE : తెలంగాణ బడ్జెట్‌పై ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం - TELANGANA BUDGET DEBATE LIVE 2024 - TELANGANA BUDGET DEBATE LIVE 2024
Published : Jul 25, 2024, 11:09 AM IST
|Updated : Jul 25, 2024, 12:00 PM IST
Debate on Telangana Budget Allocations : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తిస్థాయి వద్దును ప్రవేశపెడుతుంది. ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్లో నిధులు అధిక మొత్తంలో కేటాయింపులు చేయనుంది. రెండు రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు అనేవి ఆశించిన స్థాయిలో రాలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దగా ఏమీ దక్కకపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయం, ఇతర మార్గాల పైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ.2.75 లక్షల కోట్లు, ఇప్పుడు దానికంటే పూర్తిస్థాయి బడ్జెట్‌ను దాదాపు రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్, ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉండనున్నాయి? ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? వంటి వాటిపై ఆర్థిక నిపుణులతో ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 25, 2024, 12:00 PM IST