LIVE : తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల - ప్రత్యక్షప్రసారం - TG EdCET Result - TG EDCET RESULT
Published : Jun 11, 2024, 4:04 PM IST
TG EDCET Result LIVE : తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు ఈరోజు (జూన్11) సాయంత్రం 3:30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్రంలోని పలు కాలేజీల్లోని రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు జరిపిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ఆచార్య మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు.TG EDCET Result Today : గత నెల 23వ తేదీన జరిగిన ఎడ్‌సెట్‌కు మొత్తం 29,463 మంది హాజరయ్యారు. ఎడ్‌సెట్ పరీక్షలు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులు ఉండాలి. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.