రెండు లక్షల చింత పిక్కలతో ఎకో ఫ్రెండ్లీ గణేశ్- నిమజ్జనం తర్వాత మొలకెత్తుతాయ్! వీడియో చూశారా? - Eco Friendly Ganesh Idol - ECO FRIENDLY GANESH IDOL
Published : Sep 7, 2024, 7:16 PM IST
Eco Friendly Ganesh Idol : కర్ణాటకలోని బెళగావిలో ఓ కళాకారుడు చింతపిక్కలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ విగ్రహం 8 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో తయారు చేశాడు. నిమజ్జనం తర్వాత ఈ చింతపండు పిక్కల నుంచి మొక్కలు పెరుగుతాయనే ఉద్దేశంతో విగ్రహాన్ని తయారు చేసినట్లు కళాకారుడు సునీల్ సిద్ధప్ప తెలిపాడు.
స్థానికంగా ప్లంబర్‌గా పని చేస్తున్న సిద్ధప్ప, గత సంవత్సరం రుద్రాక్షలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశాడు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి రీసైకిల్ చేసిన వార్తాపత్రికలు, కార్డ్‌బోర్డ్, గడ్డి, చింతపండు గింజలను ఉపయోగించి విగ్రహాన్ని తయారు చేశాడు. విగ్రహం తయారి కోసం 2,21,111 చింత గింజలు ఉపయోగించినట్లు సిద్ధప్ప తెలిపారు. ఈ విగ్రహం తయారీకి మొత్తం రూ.35వేలు ఖర్చు అయినట్లు వెల్లడించారు. విగ్రహం తయారీకి నెల రోజుల పాటు రోజు రెండు గంటలు శ్రమించినట్లు పేర్కొన్నారు.