మద్యం మత్తులో యువకుల వీరంగం - కర్రలతో స్థానికులపై సైతం దాడి - Young People Fight at kamareddy
Published : Feb 5, 2024, 10:34 PM IST
Drunkards Fight at Wine Shop in kamareddy : మద్యం మత్తులో కొంత మంది యువకులు కర్రలతో దాడి చేసి వీరంగం సృష్టించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు సమీపంలో లిక్కర్ మార్ట్ వైన్స్ వద్ద యువకులు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. లిక్కర్ మార్ట్ వైన్స్ ఎదుట మందు బాబులు కర్రలతో ఒకరికొకరిపై పరస్పరం దాడి చేసుకున్నారు.
Drunkards Hal Chal In kamareddy : ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు లిక్కర్ మార్ట్ వైన్స్ కౌంటర్ వద్దకు పోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో మందు బాబులను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. తమను అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై సైతం మందు బాబులు దాడి చేశారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గొడవను ఆదుపు చేశారు. అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో గొడవ పడుతున్న యువకుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.