తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైన్​షాప్ వద్ద మందుబాబుల వీరంగం - తప్పతాగి మహిళపై దాడి - Drunk Men Attack on Woman Video - DRUNK MEN ATTACK ON WOMAN VIDEO

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 12:05 PM IST

Drunk Men Attack on Woman in Suryapet :  మందుబాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మద్యం సేవించి రోడ్డుపై హల్‌చల్‌ చేస్తూ ప్రజలకు, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో మందు బాబులు వీరంగం సృష్టించారు. తప్పతాగి గొడవ పడుతుండగా అడ్డుకున్న మహిళపై దాడి చేశారు.

అనంతగిరి మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో మందు తాగిన ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ గొడవను ఆపేందుకు ఓ మహిళ ప్రయత్నించగా మద్యం మత్తులో ఆమె జుట్టు పట్టుకుని కొట్టారు. కులం పేరుతో బూతులు తిడుతూ దూషించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైన్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా అధికారులు పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సైని వివరణ కోరగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details