వావ్ ఇలాంటి కోడిని ఎప్పుడు చూసి ఉండరు - మనిషి చెప్పినట్లు చేస్తుంది తెలుసా! - Different Hen Viral Video - DIFFERENT HEN VIRAL VIDEO
Published : Jun 17, 2024, 4:45 PM IST
Different Hen Viral Video in Jagtial : మూగ జీవులు విని అర్థం చేసుకుని దానికి తగినట్టు స్పందించడం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఓ కోళ్లఫారంలోని కోడి యజమాని ఏది చెబితే అది చేస్తోంది. ఆయన మాటల్లో చెబుతున్నట్టుగా కోడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Strange Hen Video Viral : లక్ష్మీపూర్ గ్రామంలో ఓ రైతు కోళ్ల ఫాంను నిర్వహిస్తున్నాడు. అందులో ఉన్న కోళ్లలో ఒ కోడి వింతగా ప్రవర్తిస్తుందని గమనించాడు. దీంతో ఎంతో ఇష్టంగా పెంచడం మొదలుపెట్టాడు. ఆ కోడి కడక్‌నాథ్ అనే రకానికి చెందినదిగా యజమాని తెలిపాడు. తాను ముందుకు రమ్మంటే ముందుకు, వెనక్కి రమ్మంటే వెనక్కి వెళ్లడం చేస్తుందని చెబుతున్నాడు. ఎప్పుడు తన దగ్గరే ఉంటుందని అన్నాడు. ఆ యజమాని చెబుతున్నప్పుడు దానికి అనుగుణంగా కోడి ప్రవర్తించడం చూసి స్థానికులు అశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.