ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: దిల్లీలో పవన్ కల్యాణ్ ప్రెస్​మీట్ - ప్రత్యక్షప్రసారం - PAWAN KALYAN MET AMITH SHAH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 6:34 PM IST

Pawan Kalyan met Minister Amit Shah Live: డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల పవన్​ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం, ఇప్పుడు దిల్లీకి వచ్చి అమిత్​ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. మరో వైపు రాష్ట్రంలో పోలీసు శాఖ సరిగా పని చేయట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో ఏయే అంశాలు పవన్ కల్యాణ్​ మాట్లాడారో తెలియాల్సి ఉంది. వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ దిల్లీకి బయల్దేరి వచ్చారు. అమిత్​షాతో భేటీ అనంతరం పవన్​ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.

ABOUT THE AUTHOR

...view details