LIVE: వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం- విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - HAINDAVA SHANKARAVAM LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-01-2025/640-480-23258868-thumbnail-16x9-haindava-shankaravam-live-from-vijayawada.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2025, 11:38 AM IST
|Updated : Jan 5, 2025, 5:18 PM IST
Haindava Shankaravam Live From Vijayawada : దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించింది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. కేసరపల్లి వద్ద సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షల మందికిపైగా సభలో పాల్గనేలా ఆహ్వానాలు అందజేశారు. ప్రత్యేక బస్సులు రైళ్లలో భారీగా ఈ బహిరంగసభలో పాల్గొనేందుకు విజయవాడకు జనాలు తరలివచ్చారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హిందూ ఆలయాల పరిరక్షణపై సభలో చర్చించి వారు డిక్లరేషన్ చేయనున్నారు. హిందువులంతా ఏకమై దేవాలయాల పరిరక్షణకు కదలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. హైందవ శంఖారావం సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. హైందవ శంఖారావంలో పాల్గొనేందుకు కడప నుంచి దాదాపు 11 వందల మంది ప్రత్యేక రైలులో వచ్చారు.
Last Updated : Jan 5, 2025, 5:18 PM IST