వారి తప్పులన్ని సరిచేయడానికి తీర్మానం - సంపూర్ణ మద్దతు ఇస్తారా లేదా చెప్పండి: భట్టి
Published : Feb 12, 2024, 4:33 PM IST
Deputy CM Bhatti On KRMB : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ నేతలు మద్దతు ఇవ్వాలని డీప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను తీసుకొచ్చిన తీర్మానాన్ని అంగీకరించాలని చెప్పారు. కాగా గత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాయలసీమ, మిగతా ప్రాజెక్టుల వల్ల నీరు పోతుంటే మాట్లాడని వారు గోదావరి జలాలకు ఒప్పుకున్నాం అంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.
Tummala On Godavari Water : ఆంధ్రప్రదేశ్లో రేయింబవళ్లు పనులు జరుగుతుంటే గత ప్రభుత్వం ప్రశ్నించలేదని అడిగారు. శ్రీశైలంలో ఫ్లడ్లైట్లు పెట్టి మరీ పనులు చేసిందని తెలిపారు. గోదావరి జలాలు, శ్రీశైలంలో మన భూభాగాలున్నాయని వాటి కోసం ఒప్పందాలు చేసుకున్నాం అనడం అర్థరహితం అన్నారు. తెలంగాణ నీళ్ల కోసమే పుట్టిందని, వాటి కోసమే పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా ఆ నీటిని సమర్ధవంతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంటే గతంలో జరిగినవి మళ్లీ గుర్తు చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేయకూడదని కోరారు.