ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి - అధికారులు స్పందించాలి : సీహెచ్ బాబురావు - CPM Leader Babu Rao Tour - CPM LEADER BABU RAO TOUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 2:59 PM IST

CPM Leader Babu Rao Tour in Vijayawada : రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో వాహనాల రిజిస్ట్రేషన్​ల ఆన్లైన్ సేవలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్​లు మొరాయించడం, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం, వంటి అనేక సమస్యలు నెలకొన్నాయని గుర్తు చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి సమస్యలను పరిష్కరించడంలో అధికారులకు లేదని అన్నారు. వివిధ పార్టీల నాయకులు ఎన్నికలు ముగిశాక ప్రజా సమస్యలను వదిలేసి విదేశీ పర్యటనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details