మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించడమే మా లక్ష్యం - కూనంనేని - CPI Kunamneni Fires on BJP - CPI KUNAMNENI FIRES ON BJP
Published : May 7, 2024, 4:52 PM IST
CPI Kunamneni Sambhashiva Rao Fires on BJP : దేశంలో బీజేపీని మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని, లక్షల కోట్లు దోచుకున్న వారంతా ఆ పార్టీలోనే ఉన్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. లక్షల కోట్లు అవినీతి చేసిన వారు బీజేపీలో చేరితే ఎలా నీతివంతులు అవుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పదేళ్ల కాలంలో బీజేపీని ఎదురించిన వారిపై కేసులు పెట్టి జైల్లో వేయిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మహిళలకు రక్షణ లేదన్న కూనంనేని మతం పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. యుద్ధాలను ఆపామన్న మోదీ, ముస్లిం, మైనార్టీలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో జరబోయే ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.