తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దు : కాంగ్రెస్ అధికార ప్రతినిధి - Chanagani Dayakar On Phone Tapping - CHANAGANI DAYAKAR ON PHONE TAPPING

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 9:50 PM IST

Chanagani Dayakar On Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం అత్యంత ప్రమాదకరమైందని, రాష్ట్రంలో మానవ, ప్రజాస్వామిక హక్కులను కాలరాసిన హంతక ముఠాను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను చాలా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించారు. కేసీఆర్ పాలనలో స్వేచ్ఛగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా ఉండేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు వారిని కదలకుండా గృహనిర్బంధాలు చేసేవారని ఆరోపించారు.  

2021 జులై 18వ తేదీన ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇందిరాపార్క్ ధర్నాలో పాల్గొని ప్రభాకర్‌రావు ఏ పుట్టలో దాక్కున్నా తీసుకొచ్చి అరెస్టు చేస్తామని చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్‌కు చెందిన అనేక రాక్షస క్రీడలు బయట పడుతున్నాయని విమర్శించారు.  

ABOUT THE AUTHOR

...view details