ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కోడిగుడ్ల దాడి - సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన - protest against kale yadaiah - PROTEST AGAINST KALE YADAIAH
Published : Aug 28, 2024, 5:09 PM IST
Congress Leaders Protest Against Chevella MLA Kale Yadaiah : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్‌లో విబేధాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య వాహనంపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం కోడిగుడ్లతో దాడిచేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు కాలె యాదయ్య షాబాద్ వెళ్లగా ఇంఛార్జ్ భీంభరత్ వర్గం అడ్డుకుంది. తమ వర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కోడి గుడ్లతో దాడి చేశారు. కాలె యాదయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అక్కడకు వచ్చిన షాబాద్ మండలపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌పై కొందరు కార్యకర్తలు దాడి చేశారు. సుమారు గంటపాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడి, నిరసన సమయంలో ఎమ్మెల్యే యాదయ్య కారులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు బాహాబాహీకి దిగేందుకు ప్రయత్నించగా సమయానికి అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కారు దిగి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్య లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంచి వెళ్లిపోయారు.