తెలంగాణ

telangana

ETV Bharat / videos

అసెంబ్లీ సమావేశానికి రాకుండా నల్గొండలో కేసీఆర్​ సభ ఏంటి? : మల్లు రవి - Mallu Ravi About KRMB Project

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 8:06 PM IST

Congress Leader Mallu Ravi Comments on KCR : బీఆర్​ఎస్​ నేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని హైదరాబాద్​లో  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుండగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకాకపోవడం ప్రజలను అవమానపర్చినట్లేనని మండిపడ్డారు. కీలకమైన బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ రాకుండా నల్గొండలో కృష్ణా జలాల గురించి సభ పెట్టి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. 

Mallu Ravi About Nalgonda BRS Meeting : కేఆర్‌ఎంబీ ప్రాజెక్టు విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ వాస్తవాలను పక్కన పెడుతున్నారని మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదని, అసెంబ్లీలో మాట్లాడాలని కేసీఆర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీటి ప్రాజెక్టుల కోసం కాదని, కేవలం ​పార్టీ కోసమే బీఆర్​ఎస్ నేతలు సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికల సమీపిస్తున్నందున బీఆర్​ఎస్​ నాయకులు ప్రజల సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  

ABOUT THE AUTHOR

...view details