తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైతు రుణమాఫీ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ధర్మపురి అర్వింద్ - MP ARVIND FIRES ON CONGRESS GOVT - MP ARVIND FIRES ON CONGRESS GOVT

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 2:09 PM IST

MP Arvind Fires On Congress Govt: రుణమాఫీ పేరుతో  రైతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్న విషయం వారికి కూడా తెలుసని వాఖ్యానించారు. రోటేషన్ చక్రవర్తి  రేవంత్ రెడ్డి అని (RRR) ముఖ్యమంత్రిని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ అమలులోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 

నిజామాబాద్ జిల్లాలో 2.50 లక్షల మంది రైతులకు రుణాలుంటే, కేవలం 83 వేల మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. రైతులను మోసం చేసినందుకే  కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించారన్నా విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే పూర్తి స్థాయి రుణ మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం రోజున ఆర్మూర్‌లో రైతులు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను పూర్తిగా మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details