తెలంగాణ

telangana

గణేశ్​ వేడుకల్లో పాములతో ఒళ్లు గగుర్పొడిచే నృత్యాలు - పోలీసుల అదుపులో నకిలీ అఘోరాలు - Snake Dance At Ganesh Utsav

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 7:12 PM IST

Cobra Dance At Tarnaka Ganesh Pandal (ETV Bharat)

Cobra Dance At Tarnaka Ganesh Pandal : భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాల్సిన వినాయక చవితి వేడుకలను కొన్నిచోట్ల సంప్రదాయానికి భిన్నంగా చేస్తూ వాటి విశిష్ఠతను దెబ్బతీస్తున్నారు. రానురాను వింతపోకడలను అవలంభిస్తున్నారు. హైదరాబాద్​ తార్నాక విజయపురి కాలనీలో వినాయక మండప నిర్వాహకులు అఘోర వేషధారణలో పాములు ధరించి ఉన్న కొందరిని తీసుకొచ్చి నృత్యాలు చేయించారు. మెడలో కపాలాలు ధరించి చేతిలో సర్పాలను పట్టుకుని అతి ప్రమాదకరంగా తిప్పుతూ విన్యాసాలు చేశారు. దీంతో స్థానికులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటన గణేశ్​ మండపం వద్ద జరగడం స్థానికంగా కలకలం రేపింది. 

సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వేషధారులను అదుపులోకి తీసుకున్నారు. పాములతో విన్యాసాలు చేయడమంటే ప్రాణాలతో చెలగాటమాడటం లాంటిదే. ఇటీవలే సర్పాలతో విన్యాసాలు చేసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాగా కపాలాలు ధరించి అఘోరాల వేషంలో సర్పాలతో నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ABOUT THE AUTHOR

...view details