ETV Bharat / health

చలికాలం సాక్సులు వేసుకొని నిద్రపోతున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - SLEEPING WITH SOCKS IN WINTER

రాత్రిపూట సాక్సులు ధరించి నిద్రించే అలవాటు ఉందా? - అయితే, ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Health Benefits of Sleeping With Socks
Sleeping With Socks On (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 9:36 PM IST

Health Benefits of Sleeping With Socks at Night : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది చలి తట్టుకోలేక రాత్రిపూట స్వెటర్లు, మఫ్లర్లు ధరించి నిద్రపోతూ ఉంటారు. అయితే, కొంతమంది పడుకునేటప్పుడు వాటితో పాటు కాళ్లకు సాక్సులు కూడా వేసుకుంటుంటారు. నిద్రపోయేటప్పుడు సాక్సులు వేసుకుంటే చలి నుంచి ఉపశమనం లభించడంతో పాటు వెచ్చగా, హాయిగా ఉంటుందని ఇలా చేస్తుంటారు. ఇంతకీ, రాత్రిపూట సాక్సులు వేసుకొని నిద్రించడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిజానికి రాత్రిపూట సాక్స్‌లు వేసుకొని నిద్రించడం కొంత వరకు చలిని తగ్గించి, పాదాలు వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది. కంఫర్ట్​గా ఉంటుంది. అంతేకాదు, నిద్రించే టైమ్​లో కాళ్లకు సాక్సులు వేసుకోవడం ద్వారా ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..

మంచి నిద్రకు ఉపకరిస్తుంది : వింటర్​లో చాలా మంది చలి కారణంగా సరిగ్గా నిద్రపోరు. అలాంటి వారు పడుకునే ముందు కాళ్లకు సాక్సులు ధరించి నిద్రిస్తే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సాక్సులు వేసుకోవడం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పాదాలను వెచ్చగా ఉండేలా చేస్తుంది. ఇది మీరు త్వరగా నిద్ర పోవడానికి ఉపకరిస్తుందంటున్నారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్​లో కూడా రాత్రిపూట సాక్సులు ధరించడం వల్ల పాదాల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మంచి నిద్రను పొందడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రక్త ప్రసరణ మెరుగు : శీతాకాలం రాత్రిళ్లు పాదాలు చలి కారణంగా చల్లగా అవుతాయి. దాంతో రక్త నాళాలు సంకోచం చెంది.. రక్త ప్రసరణ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, రాత్రిపూట కాళ్లకు సాక్సులు వేసుకొని నిద్రిస్తే రక్త ప్రసరణ మెరుగుపడడానికి తోడ్పడుతుందట. బాడీలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే.. అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజర్ సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా గుండె, లంగ్స్, కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

అమ్మలూ.. పిల్లల పాత సాక్సుల్ని పడేస్తున్నారా ? - ఒకసారి ఇలా ఉపయోగించి చూడండి!

పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు! : చాలా మందిలో వింటర్​లో చలి, చల్లని గాలి కారణంగా చర్మం పొడి బారి పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వారు ఈ సమస్యను తగ్గించుకోవడానికి రాత్రిళ్లు పాదాలకు ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసి సాక్సులు ధరించి నిద్రిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాక్సులు తేమను నిలపడానికి తోడ్పడుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా మారడానికి దోహదపడుతుందంటున్నారు. అదేవిధంగా నైట్ టైమ్ సాక్సులు ధరించి నిద్రించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

  • మీరు ధరించే సాక్స్‌లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మురికి సాక్స్‌లు వేసుకుంటే, ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ఛాన్స్ ఉంటుందని గమనించాలి.
  • అలాగే, మరీ టైట్​గా ఉండే సాక్సులు వేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే టైట్​గా ఉండేవి ధరిస్తే రక్తప్రసరణకు ఆటంకం కలగవచ్చు. కాబట్టి, వీలైనంత వరకు వదులుగా, శుభ్రంగా ఉండే సాక్సులు వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిన్నారులకు సాక్సులు, షూలు వేస్తున్నారా? చెప్పుల్లేకుండా నడిపిస్తే ఎన్నో లాభాలట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.