పే త్రూ పేరెంట్ - ఇక మీ పిల్లలు డబ్బు వృథా చేయరు
Published : Feb 4, 2024, 1:14 PM IST
CMR Students innovative Payment App : పిల్లల చేతికి డబ్బులిస్తే వృథాగా ఖర్చు చేస్తారేమో అనే ఆందోళన అందరు తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకే డబ్బిచ్చేందుకు వెనకాడుతుంటారు. మరోవైపు ఈ మధ్య కాలంలో పిల్లలు ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుకుంటూ, వాటికి బానిసై రూ.లక్షల కొద్దీ డబ్బులను పోగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సైబర్ అటాక్స్ కారణంగా రూ.కోట్ల డబ్బులు కొల్లగొడుతున్నారు నేరగాళ్లు. అదే కాకండా అకౌంట్ లేకుండా విద్యార్థులు బయట ఆన్లైన్ పేమెంట్ చేయడానికి నానా అవస్థలు పడుతుంటారు.
ఇంకా ఇలాంటి సమస్యలన్నించికీ చెక్ పెట్టారు సీఎంఆర్ విద్యార్థులు. ఇక ఆ భయమే లేదంటున్నారు వీరు. పే త్రూ పేరెంట్ అకౌంట్‌తో పరిష్కారం చేయవచ్చు అని చెబుతున్నారు. త్వరలోనే మొబైల్ అప్లికేషన్‌గా తీసుకురావాలని సంకల్పించారు. ఈ ఆలోచనకు ఇంటింటా ఇన్నోవేటర్‌తో పాటు విలేజ్ ఇన్నోవేషన్ కింద పలు అవార్డులు కైవసం చేసుకున్నారు. పేటెంట్ రాగానే, స్టార్టప్‌గానూ మార్చబోతున్నామని అంటున్న ఆ విద్యార్థుల ఇన్నోవేటివ్ ప్రాజెక్టు గురించి వాళ్ల మాటల్లోనే విందాం.