ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సమాజంలో మార్పు - జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ - ISKCON Temple Jagannath Rath Yatra - ISKCON TEMPLE JAGANNATH RATH YATRA
Published : Jul 7, 2024, 2:17 PM IST
CM Revanth Reddy Started ISKCON Temple Jagannath Rath Yatra : మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో తమ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ముఖ్యమంత్రి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. అన్ని మతాల భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని చెప్పారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చారు. అలాగే రథానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.