కవిత అరెస్టుతో పెద్దడ్రామాకు తెరలేపారు : సీఎం రేవంత్‌రెడ్డి - cm revanth on kavitha arrest
Published : Mar 16, 2024, 3:47 PM IST
CM Revanth Reddy Reacts on Kavitha Arrest : కవిత అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పెద్ద వ్యూహానికి తెరలేపాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సరిగ్గా, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు స్టంట్ చేస్తున్నారన్న సీఎం, కవిత అరెస్టు విషయంపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రకటనల్ని చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి అన్నారు.
కేసీఆర్ కుటుంబం, బీజేపీ నిరంతర ధారావాహిక సీరియల్‌లాగా మద్యం కుంభకోణాన్ని నడిపించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కవిత అరెస్ట్‌పై మోదీ, కేసీఆర్‌ల మౌనం వెనుక వ్యూహమేంటని ప్రశ్నించారు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ మౌనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పెద్ద డ్రామాకు తెరలేపారన్న సీఎం రేవంత్‌రెడ్డి, కక్ష సాధింపు చర్యలు ఉండవు, తప్పులు చేసినవారిని క్షమించబోమన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ చెబుతుందన్న సీఎం, ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.