తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్యాడ్మింటన్​ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి - వీడియో వైరల్ - CM Revanth Reddy Play Badminton - CM REVANTH REDDY PLAY BADMINTON

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 1:57 PM IST

CM Revanth Reddy Play Badminton : తెలంగాణ పోలీస్​ అకాడమీలో క్రీడా భవనాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సరదాగా బ్యాడ్మింటన్​ను ముఖ్యమంత్రి ఆడారు. హైదరాబాద్​ కమిషనర్​ సీవీ ఆనంద్​తో సీఎం బ్యాడ్మింటన్​ ఆడారు. అంతకుముందు అకాడమీలో జరిగిన పాసింగ్​ అవుట్​ పరేడ్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అకాడమీలోని 547 మంది సబ్​ ఇన్​స్పెక్టర్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 145 మంది మహిళలు సహా 547 ఎస్​ఐలు ఈ పరేడ్​లో పాల్గొన్నారు. వారందరికీ సీఎం రేవంత్​ రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. పరేడ్​లో మాట్లాడిన సీఎం రేవంత్​, పోలీసుల పిల్లలకు అత్యున్నత విద్య అందిస్తామని మాటిచ్చారు. 

హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలకు ఒకేచోట విద్య అందించనున్నామని వెల్లడించారు. పోలీస్​ స్కూల్​ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​ గ్రేహౌండ్స్​ వద్ద విద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వరంగల్​లో మరో విద్యాలయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో పోలీస్​ స్కూల్​ ఏర్పాటు చేసి, అందులో ఆరో తరగతి నుంచి పీజీ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details