Sitaram Yechury Memorial Meet LIVE (ETV Bharat)
LIVE : రవీంద్రభారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ ప్రత్యక్షప్రసారం - Sitaram Yechury Memorial Meet - SITARAM YECHURY MEMORIAL MEET
Published : Sep 21, 2024, 12:45 PM IST
|Updated : Sep 21, 2024, 1:04 PM IST
Sitaram Yechury Memorial Meet LIVE : కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ రవీంద్రభారతీలో జరిగిన స్వర్గీయ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన సీతారాం ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి సేవలు మరువలేనివని, దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని పేర్కొన్నారు. సీతారాం ఏచూరి లోటు పూడ్చలేనిదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈసభకు పలువురు బీఆర్ఎస్ నేతలు, సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పూర్వ ప్రభుత్వ కార్యదర్శి మోహన్ కందా తదితర నేతలు పాల్గొన్నారు.
Last Updated : Sep 21, 2024, 1:04 PM IST