LIVE : సీఎం రేవంత్‌రెడ్డి 'మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర' ప్రత్యక్షప్రసారం - REVANTH MUSI REVITALIZATION YATRA
Published : Nov 8, 2024, 3:45 PM IST
|Updated : Nov 8, 2024, 6:21 PM IST
CM Revanth Musi Revitalization sankalp Yatra Live : మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ వెంబడి పాదయాత్రతో మరో అడుగు ముందుకు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం వాటిళ్లుతుండటంతో పరీవాహక ప్రాంత రైతుల కష్టనష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయిలో సీఎం పాదయాత్ర చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతన్నల నుంచి మరింత మద్దతు కూడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సౌత్ కొరియాలోని హాన్ నది మాదిరి పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే డీపీఆర్ తయారు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయిదు కంపెనీలకు రూ.141 కోట్లతో టెండర్లు ఇచ్చింది. ఈ కంపెనీలు సమగ్రమైన డీపీఆర్‌ను ఇచ్చేందుకు 18 నెలలు గడువు విధించింది. ఇదిలా ఉండగా నది మధ్యలో ఆక్రమణలకు పాల్పడిన పేదలను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. లైవ్‌లో చూద్దాం.
Last Updated : Nov 8, 2024, 6:21 PM IST