LIVE : రవీంద్ర భారతిలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డి - CM Revanth Appreciate to Students - CM REVANTH APPRECIATE TO STUDENTS
Published : Jun 10, 2024, 3:30 PM IST
|Updated : Jun 10, 2024, 4:09 PM IST
CM Revanth Attend in Felicitation Program of 10th Class Toppers : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ తీరికలేకుండా సభలు సమావేశాలతో గడిపిని సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికలు ఫలితాలు మిశ్రమంగా రావడంతో వాటిపై సమీక్షలు జరిపారు. తాజాగా దేశంలో మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్లో, తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు సమష్ఠి కృషి చేయాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో కోడ్ ముగియడంతో ఇప్పుడిప్పుడే రాష్ట్ర పాలనపై సీఎం దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలోనే రవీంద్ర భారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను అందించిన విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం విద్యార్థులతో రేవంత్రెడ్డి మాటామంతి జరిపారు.
Last Updated : Jun 10, 2024, 4:09 PM IST