LIVE : దిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - revanth reddy live - REVANTH REDDY LIVE
Published : Jul 4, 2024, 4:09 PM IST
|Updated : Jul 4, 2024, 4:28 PM IST
DY CM Bhatti Vikramarka Press Meet LIVE : దిల్లీలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. సీఎం వెంట ప్రధాని మోదీ వద్దకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ, కొత్తవాటికి సంబంధించి నిధులు విడుదల చేయాలని కొరినట్లు సమాచారం. అలాగే విభజన హామీలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడానికి ముందే ప్రధానితో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన అనంతరం మీడియాను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని, హోం మంత్రితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను మీడియాతో వివరిస్తున్నారు.
Last Updated : Jul 4, 2024, 4:28 PM IST