తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఫైర్‌మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth At Firemen POP - CM REVANTH AT FIREMEN POP

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 11:07 AM IST

Updated : Jul 26, 2024, 12:10 PM IST

CM Revanth Reddy at Firemen Passing Out Parade Live : ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్​మెన్​ పాసింగ్​ అవుట్​ పరేడ్​లో పాల్గొన్నారు. కాగా ఫైర్‌మెన్‌ అభ్యర్థులు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ శాఖకు చెందిన సివిల్‌, ఏఆర్‌, ఎస్​ఏఆప్​సీపీఎస్​, టీఎస్​ఎస్పీ విభాగాలకు 13వేల 444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాలలో ఎంపికైన వారికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు నియామక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లలో భాగంగా శిక్షణా ప్రాంతాల్లో ఉన్న మైదానాలు చదును చేయడం, వారికి వసతి కల్పించడం వంటి అనేక పనులను చేపట్టింది. ఈ శిక్షణార్థుల్లో దాదాపు 2,000 మంది మహిళల కోసం ప్రత్యేకంగా 3 కేంద్రాలను కేటాయించారు. ఈసారి మొత్తం 17,156 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించగా. జైళ్లు, ఫైర్‌ తదితర విభాగాల పోస్టులు పోనూ 14,881 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. 
Last Updated : Jul 26, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details