అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి - Revanth Reddy Tributes To martyrs - REVANTH REDDY TRIBUTES TO MARTYRS
Published : Jun 2, 2024, 3:41 PM IST
CM Revanth Reddy Tributes To martyrs at Gunpark : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఇతల నేతలు హాజరయ్యారు.
అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుని కాసేపు మౌనం పాటించారు. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని నేతలు అన్నారు. వారి పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు వారి పోరాటాలను ఎన్నడూ మరవొద్దని సూచించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లారు.