తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : నానక్​రామ్​గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్​ - CM Revanth Live Nanakramguda

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 11:24 AM IST

Updated : Feb 18, 2024, 12:10 PM IST

CM Revanth Live : హైదరాబాద్​లోని నానక్​రామ్​గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు సనత్​నగర్​ అగ్నిమాపక కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నానక్​రామ్​గూడలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. సనత్‌నగర్‌లో నిర్మించిన ఫైర్‌స్టేషన్‌ను సీఎం వర్చువల్​గా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం లక్డీకాపూల్​ అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కొనసాగింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని నానక్​రామ్​గూడాలో అగ్నిమాపక విభాగం ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కొత్త భవనంలో అగ్నిమాపక శాఖకు తొలిసారిగా అన్ని వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఒకే చోట అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్​తో పాటు అగ్నిమాపక కేంద్రం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం ఆరు అంతస్థుల్లో  కార్యాలయం నిర్మించారు. దాదాపు రూ.17 కోట్లతో భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అత్యాధునిక వసతులు సాంకేతిక హంగులతో అగ్నిమాపక ప్రధాన కార్యాలయం అందుబాటులో ఉంటుంది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే అత్యాధునిక పబ్లిక్ సేఫ్టీ ఆన్సరింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. వైద్యం పోలీస్​విభాగాలకు అనుసంధానంతో అగ్నిమాపక శాఖ డయల్ 101 కాల్ సెంటర్ ఉండేలాగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 24 గంటలు కాల్ సెంటర్​లు అందుబాటులో ఉండే విధంగా  16 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.

Last Updated : Feb 18, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details