LIVE : మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha nominations in telangana - LOK SABHA NOMINATIONS IN TELANGANA
Published : Apr 19, 2024, 12:42 PM IST
|Updated : Apr 19, 2024, 2:11 PM IST
LIVE : సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెట్టుగడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతున్నారు. నామినేషన్లు పూర్తి అయిన అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీ నామినేషన్లు పూర్తి అయి కార్నర్ మీటింగ్ ముగిసిన అనంతరం మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది వచ్చేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాలను గెలిచి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతూ తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో స్పష్టంగా కాంగ్రెస్ వివరిస్తుంది.
Last Updated : Apr 19, 2024, 2:11 PM IST