LIVE : విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU ON VISAKHA STEEL PLANT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2025, 6:51 PM IST
|Updated : Jan 17, 2025, 7:19 PM IST
CM Chandrababu Press Meet On Visakhapatnam Steel Plant Live : విశాఖ ఉక్కుకు కేంద్ర సాయం ఓ చారిత్రక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ. 11,440 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. ఉక్కు కర్మాగారానికి అచంచలమైన మద్దతు ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి కుమారస్వామిలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్ - వికసిత్ ఆంధ్ర నిర్మాణంలో ఇదో కీలక ఘట్టమని స్పష్టంచేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదు, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పోరాట స్ఫూర్తికి స్మారక చిహ్నమని గుర్తుచేశారు. ప్రజల హృదయాలలో విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇది కేవలం ఎన్నికల వాగ్దానం మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కి మరిన్ని మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రకటించిన సాయంపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jan 17, 2025, 7:19 PM IST