ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: అచ్యుతాపురం ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu at Atchutapuram - CM CHANDRABABU AT ATCHUTAPURAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 12:24 PM IST

Updated : Aug 22, 2024, 1:20 PM IST

CM Chandrababu Naidu at Atchutapuram Live: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలు అయ్యాయి. అచ్యుతాపురం ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో మంటలు చేలరేగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులకు అనకాపల్లి, విశాఖలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు పరామర్శిస్తున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించడంతో పాటు, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఘటనపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సీఎం మాట్లాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, తక్షణం క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించాలన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని ఆదేశించారు. విశాఖ నుంచి చంద్రబాబు పర్యటన ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 22, 2024, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details