జీ20 మీటింగ్కు నా బదులు చరణ్- పవన్ సినిమాల్లో నా ఫేవరెట్ అదే: చిరు - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW
Published : May 9, 2024, 10:12 PM IST
Chiranjeevi Kishan Reddy Special Interview : కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం అందుకున్నారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా చిరును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఒకరి గురించి ఒకరు పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు.
కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కశ్మీర్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి తొలుత తనను ఆహ్వానించారని చెప్పిన ఆయన, అనుకోని కారణాల వల్ల తన తరపున రామ్‌చరణ్‌ను పంపానంటూ చెప్పారు. ఆ సమయంలోనే 'ఆర్ఆర్‌ఆర్'కు ఆస్కార్ అవార్డు వచ్చి ఉండటం కూడా దేశానికి మంచి గుర్తింపునిచ్చిందని వెల్లడించారు. దీంతో పాటు సినీ, రాజకీయ విషయాలను ముచ్చటించారు.
"కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కార్మికులకు నావంతు సాయం చేశాను. బ్లడ్ బ్యాంకు ద్వారా సేవ చేయడానికి కారణం నా అభిమానులే. వారి సహకారం వల్లే ఎంతో మందికి సాయం చేయగలుగుతున్నాం." అంటూ ఫ్యాన్స్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇక ఇదే వేదికగా తన ఫేవరట్ సినిమా గురించి కూడా రివీల్ చేశారు చిరు. "మీ సోదరుడు నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం" అని కిషన్ రెడ్డి అడగ్గా, 'తొలి ప్రేమ', 'బద్రి', 'జల్సా', 'అత్తారింటికి దారేది' సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ బ్యూటీఫుల్ మూవీస్" అంటూ చిరు రిప్లై ఇచ్చారు.