LIVE: దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam sabha - CHANDRABABU PRAJAGALAM SABHA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 5:33 PM IST
|Updated : Apr 30, 2024, 5:48 PM IST
Chandrababu Prajagalam Public Meeting Live: ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అధికార వైసీపీ అన్నింట్లోనూ పూర్తిగా విఫలం అయిందని, హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. దీంతో ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 25కి 24 లోక్‌సభ సీట్లు, 175కి 160 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేత హోదా సాధించాలని గతంలో ఎంతగానో ప్రయత్నించామని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్లుగా ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం తాను పోరాడినా సరే అంతగా ఉపయోగం లేదని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు. కాగా ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని దెందులూరు ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 30, 2024, 5:48 PM IST