ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ప్రత్తిపాడులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU NAIDU PRAJAGALAM LIVE - CHANDRABABU NAIDU PRAJAGALAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 7:03 PM IST

Updated : Apr 13, 2024, 8:19 PM IST

ChandraBabu Naidu Prajagalam Live in Prathipadu : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచార జోరును పెంచారు. రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు ప్రత్తిపాడు సభలో పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన దృష్టిలో పెట్టికొని పార్టీ కార్యకర్తలు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు ప్రజాగళం సభకు పార్టీ అభిమానులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. నిన్న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్‌ అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలేనన్నారు. దళితుల కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి, వారిని అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రత్తిపాడు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 13, 2024, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details