LIVE : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీడియా సమావేశం - tdp chief chandrababu press meet - TDP CHIEF CHANDRABABU PRESS MEET
Published : Jun 5, 2024, 10:39 AM IST
|Updated : Jun 5, 2024, 11:00 AM IST
TDP Chief Chandra Babu Naidu Press Meet : ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పోటీచేసిన అన్ని స్థానాల్లో, జయభేరి మోగించిన పార్టీగా రికార్డ్ సృష్టించింది. వందశాతం స్ట్రైక్ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి. ఇక అధికార వైఎస్సార్సీపీ కేవలం పది సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని మూగట్టుకుంది. కూటమి ఘనవిజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నేడు దిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొని రాత్రికి చంద్రబాబు అమరావతి రానున్నారు. మరోవైపు సీఎస్ జవహర్‌రెడ్డి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు సీఎస్ జవహర్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. కూటమి ఘనవిజయంపై చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 5, 2024, 11:00 AM IST