LIVE : మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ - బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత - brs mla KTR Press Meet - BRS MLA KTR PRESS MEET
Published : Aug 24, 2024, 11:52 AM IST
|Updated : Aug 24, 2024, 1:07 PM IST
BRS Working President KTR Press Meet : మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. నేడు విచారణకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఈమేరకు మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ముందుగా తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్కు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్ తెలియజేశానని చెప్పారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని అన్నారు. మహిళ ఫ్రీ బస్సుపై మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. తాజాగా కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాగా, ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా బుద్ధ భవన్ వద్దకు చేరుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Last Updated : Aug 24, 2024, 1:07 PM IST