తెలంగాణ

telangana

ETV Bharat / videos

కేటీఆర్, హరీశ్ రావు కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి - కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు - బీఆర్ఎస్ కాన్వాయ్‌పై కోడిగుడ్లు

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 5:16 PM IST

BRS Public Meeting in Nalgonda Today : నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం వెళ్తున్న బీఆర్​ఎస్ నేతలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. మధ్యాహ్నమే నల్గొండ చేరుకున్న పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఇతర నేతలు శాసనసమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసం వద్ద ఆగారు. అక్కడ వారంతా భోజనం చేశారు.

Congress Leaders Throws Eggs At BRS Convoy : అనంతరం సభా ప్రాంగణానికి బయల్దేరారు. అయితే వెళ్లే దారిలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి బస్సులు, కాన్వాయ్‌లపైకి కోడిగుడ్లు విసిరివేశారు. కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు సభాస్థలికి బయల్దేరారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అధికార పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసే సభకు భయపడి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని నిలదీశారు. 

ABOUT THE AUTHOR

...view details