తెలంగాణ

telangana

ETV Bharat / videos

శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్ర : కేటీఆర్ - KTR MLC Campaign in Alair - KTR MLC CAMPAIGN IN ALAIR

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 4:44 PM IST

BRS Leader KTR Fires on Revanth Govt : శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలకపాత్ర అని బీఆర్ఎస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించి ఓట్లు వేయాలని ఓటర్లను సూచించారు. శాసనమండలికి ఎవరిని పంపాలో విద్యావంతులంతా సరైన ఆలోచన చేయాలని కోరారు. రైతుల కళ్లలో మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని, ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. నాడు కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భరోసా సమయానికి అన్నదాతలకు అందేదన్న ఆయన, ఈరోజు రేవంత్‌ సర్కార్‌ వచ్చి రైతులను ఆగం చేసిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో పదేళ్లలో 2లక్షల ఉద్యోగుల ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్న కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన నియామకాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవటం సిగ్గు చేటన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details