LIVE : బీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా సమావేశం - BRS PARTY MEETING LIVE
Published : Feb 19, 2025, 7:04 PM IST
|Updated : Feb 19, 2025, 7:24 PM IST
BRS Party Meeting LIVE : బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశం అయింది. ఈ సమావేసానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఏడు నెలల విరామం తర్వాత కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ పాతికేళ్ల వేళ రజతోత్సవం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాగా సమావేశం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చించారు. కేసీఆర్ ఇలా ఏడు నెలలు తర్వాత పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వెల్లువిరిసింది. సమావేశం వివరాలను కేటీఆర్ మీడియాకు అందిస్తున్నారు. లైవ్లో చూద్దాం
Last Updated : Feb 19, 2025, 7:24 PM IST