LIVE : ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన - BRS Leaders Visit To Khammam
Published : Sep 3, 2024, 1:02 PM IST
|Updated : Sep 3, 2024, 1:21 PM IST
BRS Leaders Visiting Khammam Affected Areas : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు వాగు పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతలను, అక్కడ పరిస్థితులను మాజీ మంత్రి హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక నేతలంతా కలిసి పరిశీలిస్తున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. తమకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ఖమ్మం వరదల్లో మునిగింది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దీంతో స్థానికులు బతుకు జీవుడా అంటు రోడ్లపైకి వచ్చారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. మరోవైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాసితండా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రాకాసితండాను ఆకేరు వాగు వరద చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఈ తండాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
Last Updated : Sep 3, 2024, 1:21 PM IST